Tuesday, 2 September 2014

వినాయకచవితి పండగ రోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక గుడ్ న్యూస్


తెలంగాణలో మనం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది కరెంటు మాత్రమే. అది తప్ప అన్నింటా సమృద్ధిగా ఉన్న రాష్ట్రం తెలంగాణ. కానీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆ సమస్యను కూడా త్వరలో అధిగమించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ వినాయకచవితి పండగ రోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక గుడ్ న్యూస్ ఇది. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో 60 మెగావాట్ల సోలార్ పార్కు అతిత్వరలో రానుంది. ఇప్పటికే దీనికి అనుమతులతో సహా అన్నీ రెడీ అయిపోయాయి.
పుణే నగరానికి చెందిన ఎన్ రిచ్ ఎనర్జీ అనే కంపెనీ దీనిని స్థాపించనుంది. ఇప్పటికే ఈ కంపెనీ మహారాష్ట్రలో 40 మెగావాట్లను ఉత్పత్తిచేస్తోంది. మరో రెండు ప్రాజెక్టులను మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఒక్కోటి చొప్పున నెలకొల్పుతోంది. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో తన నాలుగో ప్రాజెక్టును స్థాపించడానికి ప్రయత్నాలు చేసి అనుమతి పొందింది. త్వరలో పనులు ప్రారంభం అవుతాయి. ఏడాదిలో ఈ విద్యుత్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చే అవకాశం ఉందట.

0 comments:

Post a Comment