హైదరాబాద్ – ఢిల్లీల మధ్య తిరుగుతున్న ఏపీ ఎక్స్ ప్రెస్ పేరు మారనుంది. ఇక నుండి అది తెలంగాణ ఎక్స్ ప్రెస్ గా పేరు మార్చుకోనుంది. హైదరాబాద్ – ఢిల్లీ ఎక్స్ ప్రెస్ కు పేరు మార్చాలని ఇటీవల దక్షిణమద్య రైల్వే రైల్వే బోర్డుకు ప్రతిపాదన పంపించింది. ఇక తెలంగాణ ఎంపీలు మరికొందరు ఈ విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళారు. ఈ నేపథ్యంలో ఈ రైలు పేరు మారనుంది.
హైదరాబాద్ – ఢిల్లీల మధ్యన హైదరాబాద్-ఢిల్లీ మధ్య 12723/12724 నంబరు గల రైలు ఏపీ ఎక్స్ ప్రెస్ గా నడుస్తోంది. తెలంగాణ ఎక్స్‌ప్రెస్ పేరుతో సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య ఎక్స్‌ప్రెస్ రైలు(నం.17035) నడుస్తోంది. దానికి వేరే పేరు పెట్టి ..దీనికి తెలంగాణ ఎక్స్ ప్రెస్ గా నామకరణం చేయనున్నారు. ఇక ఇటీవల రైల్వే బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం విజయవాడ – ఢిల్లీల మధ్యన ఎక్స్ ప్రెస్ రైలును కేటాయించింది. దీనిని ఏపి ఎక్స్ ప్రెస్ గా నడపనున్నారు.
0 comments:
Post a Comment