Thursday 4 September 2014

సవాల్ కు హరీష్ రె’ఢీ’

మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి జగ్గారెడ్డి గెలుస్తాడని ..టీఆర్ఎస్ నేత హరీష్  రావు రాజకీయ సన్యాసం చేస్తాడా ? అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్న నేపథ్యంలో ఎర్రబెల్లి సవాల్ ను తాను స్వీకరిస్తున్నట్లు తెలంగాణ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. మెదక్ ఉప ఎన్నికలో జగ్గారెడ్డి గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, అదే సమయంలో జగ్గారెడ్డి ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకునేందుకు ఎర్రబెల్లి దయాకర్ రావు సిద్దంగా ఉన్నాడా ? అని హరీష్ రావు ప్రశ్నించారు.
మెదక్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేత అయిన జగ్గారెడ్డిని చివరి నిమిషంలో తీసుకువచ్చి బీజేపీ టికెట్ మీద నిలబెట్టారు. ఇక బీజేపీ నేతలకన్నా ఎక్కువగా ఇక్కడ ప్రచారంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు హంగామా చేస్తున్నారు. ప్రచార సభలలో తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శిస్తున్నారు. కేసీఆర్ కుటుంబం మీద దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హరీష్ రావు సవాల్ స్వీకరించడంతో దానిని ఎర్రబెల్లి స్వీకరిస్తాడు అన్నది అనుమానమే.

0 comments:

Post a Comment