Thursday 4 September 2014

రాజధాని ప్రకటించిన చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ పేరుకై సభ్యుల డిమాండ్ ....

ఏపీ రాజధానిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. రాజధాని ‘విజయవాడ’నేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో అధికారికంగా ప్రకటించేశారు. ఇక, ఇప్పుడు అందరి దృష్టి కొత్త రాజధానికి పెట్టే పేరుపై పడింది. గతకొద్దికాలంగా నూతన రాజధానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలనే డిమాండ్ ఊపందుకొంది. ముఖ్యమంగా తెదేపా నేతలు ఈ సిఫార్సును చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తున్నారు. కొత్త రాజధానికి ఎన్టీఆర్ పేరు పెడితే తప్పేంటని మంత్రి యనమల శాసనసభలోనే ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం పూర్తయిన పిదప ‘ఎన్టీఆర్’ పేరు పెడతామని స్పష్టం చేశారు. ధూళ్లిపాళ్ల నరేంద్ర, కాల్వా.. తదితర మంత్రులు కూడా బాహాటంగానే రాజధాని పేరును ప్రస్తావిస్తున్నారు.
రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేసిన తెదేపా ప్రభుత్వానికి దానికి.. ఎన్టీఆర్ పేరు పెట్టడం పెద్ద కష్టమే కాదు. ఇప్పటికే క్యాప్టెల్ కు “తారక రామ” పేరు ఖరారైందని అధికార పార్టీ నేతలు చెబుకుంటున్నారు. కాకపోతే.. సరైన టైమ్ చూసి నామకరణం చేస్తారట. సీమాంధ్ర ప్రజలు కూడా రాజధానికి ఎన్టీఆర్ పేరు పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగోడి.. వాడి వేడిని ప్రపంచానికి చాటిన అన్న ఎన్టీఆర్ పేరును రాజధానికి పెట్టడం ప్రతి తెలుగోడు గర్వించదగ్గదే.


0 comments:

Post a Comment