Thursday 4 September 2014

గూగుల్ సెర్చ్ లో టాప్ ఏంటో తెలుసా ?

ప్రపంచంలోని యూనెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతాలలో చోటు దక్కించుకున్న కట్టడాలలో ఎక్కువమంది శోధిస్తున్నది దేని గురించో తెలుసా ? ఇంక దేని గురించి మన హైదరాబాద్ షాన్ ..చార్ సౌ సాల్ కా నిషాన్ మన చార్మినార్ గురించేనట. ప్రపంచంలోని ప్రముఖ కట్టడాల జాబితాలో చోటు దక్కించుకున్న చార్మినార్ గురించి ఎక్కువ మంది గూగుల్ సెర్చ్ లో వెతుకుతున్నారట. హైదరాబాద్ కు రావాలనుకుంటున్న పర్యాటకులు ఇక్కడ దేనిని సందర్శించాలి భావిస్తూ తమ మొదటి ఓటు చార్మినార్ కే వేస్తున్నారట.
2013 నుండి గూగుల్ ద్వారా పరిశీలించిన డాటాను విశ్లేషించి ఈ వివరాలను వెల్లడించారు. చార్మినార్ తరువాత స్థానాలలో సాలార్ జంగ్ మ్యూజియం, ఫలక్ నుమా ప్యాలేస్, పురానీ హవేలీలు ఉన్నాయి. ఇక వీటి తరువాత కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో ఉన్న ఇతర కట్టడాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. హైదరాబాద్ సంస్కృతికి వారసత్వంగా నిలిచిన చార్మినార్ ప్రథమస్థానంలో నిలవడం తెలంగాణకు గర్వకారణం.

0 comments:

Post a Comment