Monday, 8 December 2014

గ్లామరస్ పాత్రలకు నో





హీరోయిన్ గా చేసినవి రెండే సినిమాలు. కానీ కావాల్సినంత పేరును సంపాదించాయి పెట్టాయి అవికాకు . చిన్నారి పెళ్లి కూతురు సిరీయల్ తో.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన.. అవికా హీరోయిన్ గా రాణిస్తోంది. మొదటి సినిమా ’ఉయ్యాల జంపాల’తో ఓ హిట్ అందుకొంది. తాజాగా, ’లక్ష్మీ రావే మా ఇంటికి’ తో లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ’లక్ష్మీ.. ’ మంచి టాక్ ను సొంత చేసుకొంది. అయితే, ఈ యంగ్ అవికా గ్లామరస్ పాత్రలకు దూరమని స్పష్టం చేస్తోంది. తాజాగా, ఓ టీవి ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అందాల అవికా మాట్లాడుతూ.. ‘ గ్లామరస్ పాత్రలకి మరియు స్కిన్ షో కి నేను స్ట్రిక్ట్ గా నో చెప్పేస్తాను. టాలీవుడ్ లో నేను నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలే చెయ్యాలి అనుకుంటున్నానని’ కుండబద్దలు కొట్టింది. మరీ.. ఈ స్ట్రిక్ట్ కండిషన్స్ ని ఎంతకాలం పాటిస్తుందోనని తోటి కథానాయికలు గుసగుసలాడుకుంటున్నారట.

0 comments:

Post a Comment