‘షాహిద్ కపూర్, కరీనా కపూర్‌ల నిజజీవిత ప్రేమకథ అందరికీ తెలిసిందే.
విడిపోయిన తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటించడం మానేశారు. ఇక.. ఎప్పటికీ ఈ జోడీ
కలిసి నటించరని చాలామంది ఫిక్స్ అయ్యారు కూడా. ఈ నేపథ్యంలో ‘ఉడ్తా పంజాబ్’
అనే చిత్రంలో వారు నటించనున్నారనే వార్త ప్రచారంలో ఉంది. ‘కరీనాతో కలిసి
నటిస్తున్నారటగా’ అని షాహిద్‌ను అడిగితే, ‘‘తనతో నటించనని ఎప్పుడైనా
చెప్పానా? ఈ చిత్రంలో నేను ఉన్నాను. మిగతా విషయాలను దర్శక, నిర్మాతలు
చెబుతారు’’ అన్నారు. మరి, ఇంతకీ షాహిద్ పక్కన కరీనా ఉన్నట్టా? లేనట్టా?
అధికారిక ప్రకటన వచ్చేవరకూ ఆగాల్సిందే!
0 comments:
Post a Comment