తెరపై అందంగా కనిపించడానికి ప్రయత్నాలు చేయడంలో తప్పలేదు. కానీ దానిని సాకుగా ఉపయోగించుకొని అందాల ఆరబోతకు సిద్ధపడటం సరైంది కాదు. అలా నటించడానికి నేను ఇష్టపడను అని చెబుతోంది పంజాబీ సొగసరి కాజల్ అగర్వాల్. తెలుగులో నెంబర్‌వన్ హీరోయిన్‌గా చెలామణి అవుతోన్న ఈ సుందరి సింగం చిత్రంతో బాలీవుడ్ బాట పట్టింది. ఈ సినిమాతో చక్కటి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం హిందీలో రెండు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది.
బాలీవుడ్‌లో నటిస్త్తున్నా...గ్లామర్ విషయంలో హద్దులు దాటే ప్రసక్తే లేదని చెబుతోంది కాజల్ అగర్వాల్. ఆమె మాట్లాడుతూ అందాల ప్రదర్శన విషయంలో మొదటి నుంచి నా దృక్పథంలో ఏ విధమైన మార్పులేదు. అందాల ఆరబోతకు నేను ఎప్పడూ సిద్ధంగా లేను. ఇతర భాషల్లో సినిమాలు చేసినంత మాత్రాన నా తీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా నేను చేయగలిగే పాత్రలు, నాకు సరిపోయే చిత్రాల్నే ఎంచుకుంటున్నాను.
అనవసరమైన అందాల ప్రదర్శనతో సినిమాకు ఏ విధమైన ఉపయోగం ఉండదని నా అభిప్రాయం. అయినా గ్లామర్ అనేది చూసే వారి దృష్టికోణం మీద అధారపడి ఉంటుంది. చీరలో కూడా అందంగా కనిపించవచ్చు. అంతే కానీ కేవలం బికినీ ధరిస్తేనే అందంగా ఉంటారని అనుకోవడంలో అర్థం లేదు అని చెప్పింది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది.


19:45
Unknown

Posted in:
0 comments:
Post a Comment