Sunday 5 October 2014

రాజమౌళి చూపు మహాభారతం యుద్ధం మీద!

చారిత్రక నేపధ్యం ఉన్న సినిమాలు రూపోదించటంలో ప్రత్యేకతను చాటుకున్న తెలుగు దర్శకుడు రాజమౌళి. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా బాహుబలి చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత జక్కన చెక్కె శిల్పం ఏమై ఉంటుంది అని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే దానిపై ఓ క్లారిటీ వచ్చినట్లే అంటున్నారు కొంతమంది. తాజాగా ఆయన మహాభారతం నేపథ్యంలో ఓ చిత్రాన్ని తెరకెక్కించాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

ఇలాంటి ఆలోచన ఎప్పటి నుంచో రాజమౌళికి ఉన్నదే. అయితే ఇప్పుడు అందుకు తగిన ప్రయత్నాలు మొదలెట్టినట్టు తెలుస్తోంది. కన్నడలో పాఠకాదరణ పొందిన "పర్వ" అనే నవల ఆధారరగా రాజమౌళి చిత్రాన్ని తెరకెక్కించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ నవలను ఎస్‌.ఎల్‌.భైరప్ప రచించారు. మహాభారత యుద్ధాన్ని మరో కోణంలో ఆవిష్కరించిన రచన ఇది. ప్రస్తుతం "పర్వ" నవల హక్కుల కోసం రాజమౌళి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

కథ ఏదైనా సరే, దానికి భారీతనం, సాంకేతిక హంగులు జోడించడం ఎస్‌.ఎస్‌.రాజమౌళికి అలవాటైన విద్యే కాబట్టి ఈ చిత్రాన్ని భారీగా అపరిమితమైన బడ్జెట్ తో అద్బుతంగా తీర్చిదిద్దాలని రాజమౌళి కల అన్నట్లు చెప్తున్నారు. సురేష్ బాబు ఈ ప్రాజెక్టుకు పూర్తి స్ధాయిలో సహాయసహకారాలు అందిస్తానని చెప్పినట్లు సమాచారం. ఈ చిత్రం మొదలైతే తెలుగులో స్టార్ హీరోలను చాలా మందిని ఒకే సినిమాలో చూసే అవకాశముందని చెప్తున్నారు.

0 comments:

Post a Comment