Sunday 5 October 2014

ఐష్‌ సాంగ్‌లో సన్నీలియోన్‌ స్టెప్పులు

ఐటెమ్‌ భామగా మొదలైనా, పూర్తి స్థాయి నాయికగా ఫేమస్‌ అవుతోంది సన్నీలియోన్‌. బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్గలో క్రేజీ నాయికలకు ఏమాత్రం తీసిపోని రీతిలో గౌరవాన్ని కూడా అందుకుంటోంది. బాలీవుడ్‌ని రెండు దశాబ్ధాలుగా తన బంధిఖానాలో ఉంచుకున్న ఐశ్వర్యారాయ్‌ నర్తించిన ఓ ప్రఖ్యాత గీతంలో అమ్మడు నర్తించనుంది. సల్మాన్‌ఖాన్‌, ఐశ్వర్యారాయ్‌ జంటగా నటించిన హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌ సినిమలోని పాపులర్‌ సాంగ్‌ `దోలీ తారో' సాంగ్‌లో నర్తిస్తోందిప్పుడు. యువతరాన్ని ఉర్రూతలూగించిన ఈ పాటలో సన్నీ ఆడిపాడడం మరింత కిక్కు రప్పిస్తుందనడంలో సందేహమేలేదు. రాజస్థాన్‌ ఎడారిలోని ఇసుకలో ఈ పాటను ఇప్పటికే తెరకెక్కించారు. కొన్ని ఎపిసోడ్‌‌స పూర్తయ్యాయి. మరికొన్ని బిట్‌‌స తెరకెక్కించాల్సి ఉంది. బాబీఖాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `లీలా' సినిమా కోసమే ఈ పాటను రీమేక్‌ చేస్తున్నారు. ఈ పాట సినిమాకే హైలైట్‌గా ఉంటుందని చెబుతున్నారు. ఐశ్వర్యారాయ్‌ నర్తించిన ఈ గీతంలో సన్నీలియోన్‌ కనిపిస్తోంది కాబట్టి కచ్ఛితంగా రాయ్‌ అభిమానుల్ని సంతృప్తిపరిచే రేంజులో అభినయించాల్సి ఉంటుంది.

0 comments:

Post a Comment