Tuesday, 21 October 2014

ఎనిమిది చిత్రాల్లో బిజీగా హన్సిక..

హన్సిక జోరు కొనసాగుతోంది. కథానాయికగా ఎనిమిది చిత్రాల్లో నటిస్తూ తీరిక లేకుండా గడుపుతోంది. ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో చిత్రాన్ని అంగీకరిస్తూ ఇతర హీరోయిన్‌లకు గట్టిపోటీని ఇస్తోంది. తమిళ చిత్రాలపై మాత్రమే దృష్టిసారిస్తున్న ఈ సుందరి తెలుగు భాషా చిత్రాలను పూర్తిగా తగ్గించింది. ఆమె దూకుడు చూస్తుంటే హన్సిక పూర్తి స్థాయిలో తమిళ చిత్రాలకే అంకితమై పోయిందని అంటున్నారు. ఇదే విషయాన్ని హన్సికను అడిగితే... తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ దూరంకానని చెప్పింది. ఆమె మాట్లాడుతూ తెలుగు, తమిళ భాషలు నాకు రెండు కళ్లలాంటివి.

రెండు భాషలు నాకు సమానమే. తమిళంలో మంచి కథలతో కూడిన చిత్రాలు రావడంతో వాటిని వదులుకోవడం ఇష్టంలేక వరుసగా సినిమాలు చేస్తున్నాను. అందుకే నా డేట్స్ ఫుల్ అయిపోయాయి. అందువల్లే తెలుగు సినిమాలకు దూరమయ్యాను. అంతేకానీ తెలుగులో కావాలని సినిమాలు తగ్గించ లేదు. ఏ భాషలోనైనా ఓ మంచి సినిమాలో భాగం కావడమే నాకు ముఖ్యం. ప్రస్తుతం తెలుగులో కొన్ని కథలను వింటున్నా. త్వరలో ఓ మంచి చిత్రంతో ఇక్కడి ప్రేక్షకుల ముందుకు వస్తా అని తెలిపింది. తమిళంలో వాలు, ఉయిరే ఉయిరే రొమియో జూలియట్‌తో పాటు మరో ఐదు చిత్రాల్లో నటిస్తుంది హన్సిక.

0 comments:

Post a Comment