Monday 8 September 2014

కెసిఆర్ వందరోజులు సూపర్ హిట్

అన్నం ఉడికిందా లేదా తెల్వాలెనంటె గిన్నెల చెయ్యి అయితె పెట్టం. ఒక్క మెతుకు పట్టుకోని సూస్తె తెల్సిపోతది. తెలంగాణ తొలి ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన ఇయ్యాలటితోని నూరుదినాలు పూర్తి జేసుకుంది. ఈ నూరుదినాల పాలన సూపర్ హిట్టయిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవ్వలు అనుకోని రీతిల పాలనల దూసుకపోతున్నడని తెలంగాణ ప్రజలు సంతోషంగ చెప్తున్నరు. వంద రోజుల్ల కేసీఆర్ ప్రకటించిన పథకాలు, తీసుకున్న నిర్ణయాలు అందరినీ ఆకట్టుకుంటున్నయి. కేసీఆర్ ప్రకటించిన పథకాలు అన్నీ అమలయితే బంగారు తెలంగాణ తొందర్లనే కండ్లవడ్తది అని అంటున్నరు.
సమగ్రసర్వే ..
ముఖ్యంగా తెలంగాణలో ఆగస్టు 19న నిర్వహించిన సమగ్రసర్వే ఇప్పుడు జాతీయస్థాయిలో కేసీఆర్ ప్రతిభను చాటుతోంది. ఈ సర్వే మీద టీడీపీ – బీజేపీ – కాంగ్రెస్ పార్టీలు దుమ్మెత్తిపోసినా కేసీఆర్ ఏ మాత్రం ఎన్కకు జరగలేదు. సర్వే జరగాల్సిందే అని పట్టుబట్టి జరిపించారు. ఈ సర్వే విషయంలో ప్రజలలో గందరగోళం రేపేందుకు విపక్షాలు వేసిన ఎత్తుగడలు ఏవీ పనిచేయలేదు. ఎవరూ ఊహించని విధంగ ప్రజలు స్వచ్చందంగా ఈ సర్వేకు హాజరయి వివరాలు నమోదు చేయించుకున్నారు.
ప్రమాదాల్లో ప్రజలకు అండగా ..
తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరిన కొద్దిరోజులకే హైదరాబాద్ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు విహారయాత్రకు వెళ్లి హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో కొట్టుకుపోయి చనిపోయారు. ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో వేగంగా స్పందించింది. బాధితులకు అవసరం అయిన సౌకర్యాలు కల్పించింది. వారి తల్లిదండ్రులను అక్కడికి తీసుకెళ్లడం..చనిపోయిన పిల్లల శవాలను ఇక్కడికి చేర్చడంలో వారికి పూర్తి సహాయం అందించింది. వారి కుటుంబాలకు ఆసరాగా నిలబడింది. ఇక మెదక్ జిల్లా మాసాయిపేటలో పాఠశాలకు వెళ్తున్న పిల్లల బస్సును రైలు ఢీకొట్టిన సంఘటనలో తీసుకున్న చర్యలు ప్రభుత్వ చిత్తశుద్దికి అద్దంపడతాయి. ఈ సంఘటనలో అత్యంత వేగంగా బాధితులకు వైద్య సౌకర్యం అందించిన ప్రభుత్వం వారికి నష్టపరిహారాన్ని కూడా అంతే వేగంగా అందించింది. పోయిన పిల్లలను తెచ్చివ్వలేముగానీ ..మీ బాధలో మాత్రం అండగా ఉండగలం అని చాటింది.
రుణమాఫీ ..ఇన్ పుట్ సబ్సిడీ
ఇక వర్షాలు సకాలంలో కురవక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతాంగానికి రుణమాఫీతో ప్రభుత్వం అండగా నిలిచింది. రిజర్వ్ బ్యాంకు అడ్డంకులను అధిగమించి కేసీఆర్ ఈ విషయంలో రైతులకు అండగా నిలిచారు. ఇక ఇదే సమయంలో రైతులకు విడుదల చేసిన ఇన్ పుట్ సబ్సిడీ కూడా వారికి ప్రభుత్వం మీద కొండంత భరోసా కల్పించింది.
కాంట్రాక్టు ..క్రమబద్దీకరణ
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీని నిలబెట్టుకుంది. అయితే ఇది అమలు కావద్దంటూ కొందరు ఉస్మానియా విద్యార్థులు చేస్తున్న ఆందోళన విషయంలో కూడా సర్కారు తన వైఖరిని తేల్చిచెప్పింది. తాము ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేరుస్తామని, ఈ విషయంలో ఆందోళన అక్కరలేదని, నిరుద్యోగులకు త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఆకట్టుకున్న కేసీఆర్ నిర్ణయాలు..
ముఖ్యంగా ఈ నూరు దినాలలో కేసీఆర్ తీసుకున్న పలు నిర్ణయాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఇక ఆయన ప్రత్యర్ధులను ఆశ్చర్యపరిచాయి. హైదరాబాద్ ను వైఫై – 4జి నగరంగా చేయడం. తెలంగాణకు వాటర్ గ్రిడ్. పరిశ్రమల ఏర్పాటుకు 5 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్, సింగిల్ విండో పారిశ్రామిక విధానం. బడ్జెట్ రూపకల్పనకు టాస్క్ ఫోర్స్. గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ. ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్ల రవాణా పన్ను ఎత్తివేత వంటి నిర్ణయాలు కేసీఆర్ కు తెలంగాణ పట్ల ఉన్న అవగాహనకు, తెలంగాణ ఎలా ఉండాలి అన్న ఆలోచనకు అద్దంపట్టాయి.
విద్యుత్ ఒక్కటే కాస్త ఇబ్బంది ..
తెలంగాణ ప్రభుత్వానికి కాస్త ఇబ్బందిగా మారిన సమస్య విద్యుత్ ఒక్కటే. మరో మూడేళ్లు విద్యుత్ ఇబ్బందులు తప్పవు అని కేసీఆర్ బహిరంగంగానే చెబుతున్నారు. రైతులు, ప్రజలు ఈ విషయంలో సహకరించాలని, మూడేళ్ల తరువాత అసలు విద్యుత్ సమస్యనే ఉండదని హామీ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ విషయంలో కేసీఆర్ చేయగలిగింది ఏమీ లేదు. పీపీఏ ఒప్పందాలను గౌరవించకుండా చంద్రబాబు తెలంగాణకు రావాల్సిన విద్యుత్ ను అడ్డుకోవడం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుండి పూర్తి సహకారం ఇంకా అందకపోవడం మూలంగా ఈ సమస్య బాధిస్తోంది. త్వరలోనే దీనిని అధిగమించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

0 comments:

Post a Comment