బాహుబలి చిత్రం తర్వాత తాను
పెళ్లికి సిద్ధమవుతున్నానని ఇటీవల తమిళ మీడియాలో వచ్చిన వార్తల్ని
ఖండించింది అనుష్క. లింగా చిత్రీకరణలో వున్న అనుష్కకు ఓ తమిళ దర్శకుడు
హీరోయిన్ ఓరియెంటెడ్ కథను వినిపించాడని, పెళ్లి కారణం చూపుతూ అనుష్క ఆ
ఆఫర్‌ను తిరస్కరించిందని తమిళమీడియాలో వార్తలు వెలువడ్డాయి. అనుష్క
పెళ్లాడే వ్యక్తి చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తికాదని, అతనో ప్రముఖ
వ్యాపారవేత్తని కథనాలు ప్రసారమయ్యాయి. వీటిపై తన మేనేజర్ ద్వారా వివరణ
ఇచ్చింది అనుష్క. అనుష్క పెళ్లిగురించి వస్తోన్న వార్తల్లో నిజం లేదు.
బాహుబలి చిత్రం పూర్తయ్యాక అనుష్క తెలుగులో భాగమతి పేరుతో రూపొందనున్న
చిత్రంలో నటిస్తుంది. తమిళంలో ఆమె లింగా చిత్రంతో పాటు అజిత్‌తో చేస్తున్న ఓ
సినిమాను పూర్తి చేయాల్సివుంది. ఈ చిత్రాలన్నీ పూర్తి కావడానికి మరో ఏడాది
పడుతుంది. ఆ కారణంగానే అనుష్క కొత్త చిత్రాల్ని అంగీకరించడం లేదు అని
అనుష్క మేనేజర్ పేర్కొన్నారు.
0 comments:
Post a Comment