Friday, 19 September 2014

అల్లు అర్జున్ చిత్రంలో ఉపేంద్ర

అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని పతాకంపై ఈ చిత్రాన్ని ఆర్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలోని ఓ కీలక పాత్రలో కన్నడ హీరో ఉపేంద్ర నటిస్తున్నారని తెలిసింది. ఇ.వి.వి. సత్యనారాయణ రూపొందించిన కన్యాదానం తరువాత ఆయన తెలుగులో టాస్ చిత్రంలో నటించారు. అనంతరం ఆయన తెలుగులో నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ నెలాఖరు నుంచి సెట్స్‌పైకి రానున్న ఈ చిత్రంలో కథానాయికలుగా సమంతా, ఆదా శర్మ, రాశి ఖన్నా నటిస్తున్నారు.


0 comments:

Post a Comment