Friday, 19 September 2014

'ఐ 'చిత్రం లింగేశ్వరన్ అనే బాడీబిల్డర్ కథ.....

వెండితెరపై వైవిధ్యతకు, కొత్తదనానికి చిరునామాగా నిలుస్తాయి దర్శకుడు శంకర్ చిత్రాలు. సందేశాత్మక కథలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి చిత్రాల్ని తెరకెక్కించడంలో ఆయన సిద్ధహస్తుడు. అందుకే శంకర్ సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్నంటుతాయి. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ఐ. విక్రమ్, అమీజాక్సన్ జంటగా నటిస్తున్నారు. ఆస్కార్ రవిచంద్రన్ నిర్మాత. ఒక పాట మినహా ఈ సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లింగేశ్వరన్ అనే బాడీబిల్డర్ చుట్టూ తిరుగుతుందని సమాచారం.

ఇందులో విక్రమ్ పాత్ర చిత్రణ మూడు భిన్న పార్శాల్లో కొనసాగుతుందట. అందులో ఒకటి హీరో పాత్రకాగా, మరొకటి విలన్ పాత్ర అని, మూడో పాత్ర పూర్తిగా కొత్తదనంతో సాగుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. బాడీబిల్డర్ పాత్రను అర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ స్ఫూర్తితో రూపొందించినట్లు ఇటీవలే ఆడియో విడుదల వేడుకలో శంకర్ తెలియజేశారు. పీటర్‌మింగ్ అనే ఫైట్ మాస్టర్ ఆధ్వర్యంలో తెరకెక్కించిన సైకిల్ ఛేజ్ పోరాట సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నట్లు ఆయన తెలిపారు. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని వచ్చే నెల 23న విడుదల చేయడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.

0 comments:

Post a Comment