Friday, 19 September 2014

చేయాలా, వద్దా అనేది నా ఇష్టం: దీపిక

తమను మహిళలుగా గౌరవించాలని బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే విజ్ఞప్తి చేశారు. నిజ జీవితంలో ఎలావుంటామో అలాగే తమను చూడాలని, సినిమాల్లో పోషించే పాత్రలను బట్టి తమను పోల్చవద్దని కోరారు. కళాకారిణిలను తెర వెనుక తమను మహిళలుగా గౌరవించాలని సూచించారు. ఈమేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.

సినిమాలో కథానుసారం తమ వస్త్రధారణ ఉంటుందని దీపికా పదుకొనే వివరించారు. ముఖం నుంచి కాళ్ల వరకు వస్త్రాలు ధరించాలని లేదా నగ్నం కనపడాలని కథ డిమాండ్ చేస్తే చేయాలా, వద్దా అనేది తమ నిర్ణయంపై ఆధారపడివుంటుందన్నారు. అది సినిమాలో రోల్ మాత్రమే, రియల్ కాదన్నారు. తాను చేసే పాత్రకు న్యాయం చేయడమే నటిగా తన బాధ్యత అని తెలిపారు.

0 comments:

Post a Comment