Wednesday 3 September 2014

హైదరాబాద్ పై సీమాంధ్రులకు అధికారం లేదు: టి అర్ ఎస్ ఎం పి కవిత

హైదరాబాద్ సోమాజీగూడా ప్రెస్ క్లబ్ లో తెలంగాణ పబ్లిక్ సెక్టార్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యోగుల విభజన, ఆస్తులు, అప్పులు అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నిజామాబాద్ ఎంపీ కవిత పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైదరాబాద్ కామన్ కాపిటలే తప్ప జాయింట్ కాపిటల్ కాదని దీనిపై సీమాంధ్రులకు ఎటువంటి అధికారాలు ఉండవని తేల్చి చెప్పారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతీ ప్రభుత్వ అనుబధ సంస్థ ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ అందేలా ప్రభుత్వంపై వత్తిడి తెద్దామని పేర్కొన్నారు. ఆమె ఇంకా మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దినం జూన్ 2వ తేదీ తరువాత ఉద్యమాలు ఆగుతాయి అనుకున్నామని , కాని ఉద్యోగుల విభజన, పోలవరం ప్రాజెక్టు, హైదరాబాద్ ఆస్తులు, గవర్నర్ అధికారాలు అంటూ పలు అంశాలపై నిరంతరం ఉద్యమించాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. ఇక ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ ఉద్యోగుల సంఘం నాయకుడు దేవి ప్రసాద్ మరియు ఇతర తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.

0 comments:

Post a Comment