Wednesday 3 September 2014

వందమందిని తయారు చేస్తాం – ఏపి సిఎం చంద్రబాబునాయుడు

తెలుగుదేశం పార్టీ నుంచి ఒక నాయకుడు వెళ్ళిపోయినంత మాత్రానా, పార్టీ దిక్కులేనిది అయిపోదని, పార్టీలో సమర్ధులైన కార్యకర్తలు ఎందరో ఉన్నారని వారిలోనుంచే నాయకులు పుట్టుకొస్తారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.  హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ లో ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతు .. వచ్చే ఎన్నికలలో ఖమ్మం జిల్లాలోని అన్ని స్థానాలనుంచి విజయం సాధిస్తామని చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కార్యకర్తకు తాము అండగా ఉంటామని చంద్రబాబు నాయుడు ఖమ్మం జిల్లా కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చారు.

0 comments:

Post a Comment