Wednesday 3 September 2014

ఒక్క ఐడియా… ఒక్క వారం… ప్రపంచ అవార్డు

ఆలోచనలో పస ఉంటే నువ్వు గొప్పోడు కావడానికి ఒక్క క్షణం చాలంటారు. అది అక్షరాల నిజమని నిరూపితం అయ్యింది. ఒక మంచి ఆలోచన కొన్ని లక్షల మందికి మేలు చేసింది. ఆ ఆలోచన చేసిన మహిళకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టింది. అసలు విషయం ఏంటంటే.. కొంతకాలంగా ఐస్ బకెట్ ఛాలెంజ్ అని ఒక వ్యాధిపై అవగాహన కోసం సెలబ్రటీలు పోటీలు పడి ఫ్రిజ్ వాటర్ నెత్తిమీద పోసుకుంటున్నారు. దానివల్ల ఉపయోగం ఎంత అన్నది పక్కన పెడితే దానివల్ల సెలబ్రిటీలు పొందుతున్న లాభమే ఎక్కువ. ఇది మంచిదే కాని మనకు పనికొచ్చేది కాదంటూ హైదరాబాదుకు చెందిన జర్నలిస్టు మంజులత కళానిధి దానిని స్ఫూర్తిగా తీసుకుని మనకు కావల్సింది ఐస్ బకెట్ కాదు, రైస్ బకెట్ అని పిలుపునిచ్చింది. అంతే… ఒక బకెట్ నీరు మీద పోసుకోవడం కంటే ఒక బకెట్ రైస్ ఎవరికైనా పేదవాళ్లకు దానం చేయండని ఆమె ఇచ్చిన పిలుపు గంటల్లో పాకిపోయింది. వారంలో అరవై వేల ఫేస్ బుక్ లైకులకు చేరింది. కొన్ని లక్షల మంది ఆమె ఆలోచనకు ప్రభావితమయ్యారు. పేదల కడుపు నింపిన ఆమె ఆలోచన ఐక్య రాజ్య సమితికి కూడా నచ్చింది. అంతర్జాతీయంగా “ఐకాంగో’ సేవా రంగంలో వారికిచ్చే కర్మవీర్ అవార్డు ఆమెకు దక్కింది. మంజులతకు వచ్చే ఏడాది మార్చిలో ఈ అవార్డును ఢిల్లీలో జరిగే వేడుకలో ప్రదానం చేస్తారు. మొత్తానికి ఒక మంచిపనికి ఇంత వేగంగా గుర్తింపు రావడం ముదావహం. ఆమె మన హైదరాబాదీ కావడం మనకు ఆనందం.

0 comments:

Post a Comment