Monday, 22 September 2014

"ఐ" చిత్రం సరికొత్త సంచలనాలకు వేదికగా నిలుస్తోంది.

దక్షిణాది సినీ చరిత్రలోనే అత్యధికంగా 180కోట్ల భారీ బడ్జెట్‌తో దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ఐ సరికొత్త సంచలనాలకు వేదికగా నిలుస్తోంది. ఆస్కార్ ఫిలింస్ బ్యానర్‌పై రవిచంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విక్రమ్, అమీజాక్సన్ జంటగా నటిస్తున్న ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దీపావళికి ప్రేక్షకులముందుకు వస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఇటీవలే ఆడియో వేడుకలో విడుదల చేసిన విషయం తెలిసిందే. వారం వ్యవధిలోనే టీజర్‌ను 5 మిలియన్ల మంది వీక్షించారని, తమిళ సినీ చరిత్రలోనే ఇదొక కొత్త రికార్డని చిత్ర వర్గాలు వెల్లడించాయి.

0 comments:

Post a Comment