Monday, 22 September 2014

నాగార్జున సరసన సోనల్ చౌహాన్.......


లెజెండ్ చిత్రంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సోనల్ చౌహాన్ తెలుగులో మరో బంఫర్ ఆఫర్‌ను సొంతం చేసుకుంది. నాగార్జున సరసన నటించే అవకాశాన్ని అందుకుంది.

వివరాల్లోకి వెళితే...నాగార్జున ద్విపాత్రాభినయంలో నటిస్తూ అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సోగ్గాడే చిన్ని నాయనే పేరుతో ఓ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ద్వారా కళ్యాణ్‌కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రామ్మెహన్.పి కథను అందిస్తున్నారు.

పల్లెటూరి నేపథ్యంలో కుటుంబం బంధాలు ప్రధానంగా రూపొందనున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ ఓ కథానాయికగా ఎంపికైంది. మరో నాయిక కోసం కొంతకాలంగా అన్వేషణ సాగిస్తున్న చిత్ర బృందం ఈ స్థానాన్ని మొదట తమన్నాతో భర్తీ చేయాలని భావించారు. అయితే ఆమె డేట్స్ అందుబాటులో లేకపోవడంతో సోనాల్ చౌహన్‌ను సంప్రదించినట్లు తెలసింది. వీరి ఆఫర్‌కు ఈ సుందరి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఆమె ఎంపికకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

0 comments:

Post a Comment