Monday, 22 September 2014

అల్లు అర్జున్ చిత్రం మొదలైంది!

అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్ర రెగ్యులర్ షూటింగ్ సోమవారం  ప్రారంభమైంది.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమంతా, ఆదాశర్మ, రాశిఖన్నా కథానాయికలు. ఏప్రిల్‌లో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకున్న విషయం తెలిసిందే. జులాయి తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్ కలయికలో వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. నవ్యమైన కథ, కథనాలతో ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ పాత్ర చిత్రణ సరికొత్త పంథాలో వుంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో స్నేహ, కన్నడ నటుడు ఉపేంద్ర కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతాన్నందిస్తున్నారు.

0 comments:

Post a Comment