Monday 8 September 2014

దైవకణంతో విశ్వ నాశనం

లండన్‌: విశ్వం ఎలా అంతమవుతుంది? వరదలు, ప్రళయాలు వగైరా వగైరా వంటి వాటితో విశ్వం తుడిచిపెట్టుకుపోతుందా? అంటే సరైన సమాధానం రాకపోవచ్చు. కానీ, దైవకణంగా మనం పిలుస్తున్న హిగ్స్‌-బోసన్‌కు మాత్రం విశ్వాన్ని నాశనం చేసే శక్తి ఉందట! ఇది 72 ఏళ్ల ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ ఇటీవల చెప్పిన కఠోర నిజం! అధిక శక్తి వద్ద దైవకణం అస్థిరంగా ఉంటుందని ఆయన అంటున్నారు. దాని వల్ల ‘విధ్వంసక శూన్యం’ (కేటాస్ర్టోఫిక్‌ వాక్యూమ్‌ డెకే) ఏర్పడి విశ్వం మొత్తం అంతమవుతుందని ఆయన హెచ్చరించారు. ఆ శూన్యం కాంతివేగంతో విశ్వం మొత్తం ఆవరిస్తుందట! స్థలకాలాదులన్నీ ఏకమైపోయి విశ్వంలో ఏమీ మిగలదని అంటున్నారు.
అది ఎలా వస్తుందో, ఎప్పుడో వస్తుందో కూడా ఎవరికీ అంతుపట్టదని హెచ్చరించారు. చందమామపై తొలిసారి అడుగిడిన నీల్‌ ఆర్మ్‌సా్ట్రంగ్‌, బజ్‌ అల్ర్డిన్‌ తదితర వ్యోమగాములు, శాస్త్రవేత్తల వ్యాసాలతో కూడిన ‘స్టార్మస్‌’ అనే పుస్తకం ముందుమాటలో ఆయన ఈ వివరాలను తెలిపారు. 100బిలియన్‌ గిగా ఎలకా్ట్రన్‌ వోల్టులు మించినశక్తి వద్ద దైవకణం స్థిరత్వాన్ని కోల్పోతుందని.. ఆ వ్యాసంలో ఆయన పేర్కొన్నారు. అయితే, సమీప భవిష్యత్తులో అంతటి శక్తిమంతమైన పరిశోధనలు చేయగల సామ ర్థ్యం ఉన్న ప్రయోగశాలు లేనందున.. ఇప్పట్లో దాని వల్ల ప్రమాదం ఏదీ లేదని మాత్రం చెప్పారు. దైవకణాన్ని 2012లో సెర్స్‌ శాస్త్రవేత్తలు కనుగొన్న విషయం మనకు తెలిసిందే.

0 comments:

Post a Comment