Friday 26 September 2014

8 గండం గట్టెక్కేస్తాడా?

టాలీవుడ్‌ హీరోలకు `8' అంకె ఓ గండం లాంటిది. ఎవరైనా స్టార్‌ హీరో తన కెరీర్‌ ఎనిమిదో సినిమా చేస్తున్నాడంటే గుండె లబ్‌డబ్‌మనాల్సిందే. 7 సినిమాలు హిట్లయినా 8వ సినిమా ఫ్లాపవుతున్న సందర్భాలే ఎక్కువ. అలా ఇప్పటికే అరడజను పైగానే ఉదాహరణలు కళ్ల ముందున్నాయి. పవన్‌కళ్యాణ్‌ నటించిన 8వ సినిమా జానీ 2003లో రిలీజై ఫ్లాపైంది. ఇది పవన్‌ అస్సలు ఊహించనిది. అలాగే మహేష్‌ నటించిన 8వ సినిమా `నిజం' కూడా 2003లో రిలీజైంది. అది పెద్ద ప్లాపై దర్శకుడు తేజకి చెడ్డపేరు తెచ్చింది. ప్రభాస్‌ నటించిన 8వ సినిమా `యోగి' 2007లో రిలీజైంది. అది ప్రభాస్‌ కెరీర్‌లో పెద్ద ప్లాప్‌. అల్లు అర్జున్‌ నటించిన 8వ సినిమా `వరుడు' 2010లో రిలీజై డిజాస్టర్‌ అయ్యింది. బన్నికి, గుణశేఖర్‌కి ఇద్దరికీ పెద్ద మైనస్‌ ఈ సినిమా. ఎన్టీఆర్‌ నటించిన 8వ సినిమా `ఆంధ్రావాలా' పెద్ద డిజాస్టర్‌. పూరీ, ఎన్టీఆర్‌ ఇద్దరి కెరీర్‌లకు మైనస్‌ ఈ సినిమా. మరి ఇంతమంది హీరోలు `8' అంకె బారిన పడ్డారు. ఇప్పుడు సరిగ్గా ఆలాంటి సందర్భమే చరణ్‌కి కూడా వచ్చింది. కృష్ణవంశీ దర్శకత్వంలో అతడు నటించిన `గోవిందుడు అందరివాడేలే' తన కెరీర్‌ 8వ సినిమా. ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో? అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. చెర్రీ `8' సెంటిమెంటును అధిగమించి పెద్ద హిట్టు కొడతాడా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.

0 comments:

Post a Comment