Saturday, 20 September 2014

మనం ఫార్మాట్‌లో మెగాస్టార్‌150వ సినిమా?


ఏఎన్నార్‌, నాగార్జున, చైతన్య ఈ ముగ్గురు హీరోల మధ్య అనుబంధం ఎంత మధురంగా ఉంటుందో అదే మనం సినిమా. అక్కినేని కుటుంబం కోసమే `మనం' స్క్రిప్టు పుట్టింది. సినిమా చూసిన వెంటనే పండితులంతా చెప్పిన మాట ఇది. దర్శకుడు విక్రమ్‌.కె.కుమార్‌ లెక్కలు, కొలతలు అన్నీ చూసుకుని సరిపడేంత లెంగ్‌‌తలో ఈ అద్భుతమైన స్క్రిప్టుని తీర్చిదిద్దాడు. అక్కినేని కుటుంబంలో సెన్సిబిలిటీస్‌కి తగ్గట్టే కథను రాసుకున్నాడు.
ఇది తెరపై అద్భుతంగా పండి అక్కినేని చిట్టచివరి సినిమాగా మనం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయ్యింది.

ఇదే నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి నటించే 150వ సినిమా తెరపైకి వచ్చింది. అస్సలు చిరు నటించే ఈ సినిమా ఎలా ఉండాలి? అనే డిస్కషన్‌ ఫిలింనగర్‌లో మొదలైంది. రొటీన్‌గా నాలుగు పాటలు, ఐదు ఫైట్లు, సుమోలు గాల్లోకి లేవడాలు లాంటి స్క్రిప్టు అయితే చిరు ఓకే చెప్పరు. కచ్ఛితంగా ఈ స్క్రిప్టులో సంథింగ్‌ ఉండాలి. అలా ఉండాలంటే ఇప్పటికే మెగా హీరోలే ఐదారుగురు ఉన్నారు కాబట్టి వీళ్లంతా కలిసి ఒకే సినిమాలో కనిపించేలా రచయితలు ప్లాన్‌ చేస్తే ఎలా ఉంటుంది? అదే జరుగుతోందిప్పుడు. మెగాస్టార్‌కి చరణ్‌ అంటే ఎంత ఇష్టమో, బన్ని, సాయిధరమ్‌, వరుణ్‌తేజ్‌ అన్నా అంతే ఇష్టం. అందువల్ల చిరు కేంద్రకంగా కథ రాసుకున్నా ఇందులో అతిధుల్లా మిగతా మెగా హీరోలంతా మెరిసేలా ఫిలింనగర్‌లో కొందరు ఔత్సాహికులు కథలు రాసుకుంటున్నారని సమాచారం. ఆ మేరకు నిజంగానే అది వర్కవుటైతే మెగా ఫ్యాన్‌‌స అందరికీ పండుగే పండుగ.

0 comments:

Post a Comment