Saturday, 20 September 2014

నా తొలి ప్రాధాన్యత తెలుగు సినిమాలకే.....

తెలుగులో ప్రస్తుతం ఈ సుందరి ఏకంగా నాలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది. ఆమె కథానాయికగా నటిస్తున్న లౌక్యం చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో ప్రత్యేకంగా ముచ్చటించింది రకుల్‌ప్రీత్ సింగ్. ఆమె మాట్లాడుతూ ఇందులో చంద్రకళ అనే కాలేజీ అమ్మాయిగా కనిపిస్తాను. ఆధునిక భావాలు కలిగిన యువతిగా భిన్న పార్శాలతో నా పాత్ర చాలా వైవిధ్యంగా సాగుతుంది.కథానాయికగా నన్ను తెలుగు సినీ పరిశ్రమే ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. ఇక్కడే నాకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. అందుకే నా తొలి ప్రాధాన్యత తెలుగు సినిమాలకే ఇవ్వాలనుకుంటున్నాను అని అన్నారు రకుల్‌ప్రీత్ సింగ్. 
దర్శకుడు శ్రీవాస్ చెప్పిన కథ నచ్చే ఈ సినిమాను అంగీకరించాను. నా పాత్రను తెరపై అందంగా తీర్చిదిద్దారాయన. గోపీచంద్ కూడా చక్కటి సహకారాన్ని అందించారు. ఆయనతో ఎలాంటి ఒత్తిడి లేకుండా నటించాను. గోపీచంద్ నటన, అనూప్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ముఖ్యంగా డైలాగ్స్, కామెడీ సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ ప్రేక్షకుల్ని అలరిస్తాయి. అదే ఈ సినిమా ప్రత్యేకత. సినిమా ప్రతి ఒక్కరికి మెప్పిస్తుందనే విశ్వాసముంది.

అని తెలిపింది. ప్రస్తుతం తెలుగులో రఫ్, పండగచేస్కో, కరెంట్‌తీగ, కిక్-2 చిత్రాలు చేస్తున్నాను. హిందీలో రెండు సినిమాలు అంగీకరించాను. అందులో ఒకటి లెజెండరీ డైరెక్టర్ రమేష్ సిప్పీ రూపొందిస్తున్న సినిమాలో హేమామాలినీతో కలిసి నటించడం ఆనందంగా వుంది. కెరటంతో తెలుగులో కెరీర్ ప్రారంభించిన నేను వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తరువాత క్షణం తీరిక లేకుండా వరుసగా సినిమాలు చేస్తుండటం ఆనందాన్ని కలిగిస్తోంది అని తెలిపింది.

0 comments:

Post a Comment