Saturday, 20 September 2014

పవన్‌, వెంకీ ఒకరికొకరు భక్తులయ్యారు.....

పవన్‌ శ్రీకృష్ణావతారంలో వెంకీకి భక్తిని ప్రభోదిస్తుంటే, వెంకీ వివేకానందుని సూక్తుల్ని పవన్‌కి నేర్పిస్తున్నారు. `గోపాల గోపాల' సెట్‌‌సలో ఎదురైన సన్నివేశమిది. విషయమేమంటే.. ఈ సినిమా ఆన్‌సెట్‌‌స కొన్ని వింతైన పరిణామాలు చోటు చేసుకున్నాయని సమాచారం. వెంకీ మైండ్‌సెట్‌ ఇతర హీరోలతో పోలిస్తే భక్తి తత్పరత ఉన్న హీరో. ముఖ్యంగా వివేకానందుడికి భక్తుడాయన. అనవసరంగా బ్యాగేజీని నెత్తిన వేసుకుంటే మనశ్శాంతి ఉండదు! అన్న వివేకానందుని సూక్తిని బలంగా నమ్మే హీరో వెంకీ. అందుకే అనవసర వ్యాపకాల జోలికి వెళ్లకుండా క్రమశిక్షణతో కేవలం తన పని తాను చూసుకుంటాడు. ఇప్పుడు సెట్‌‌సలో పవన్‌కి కూడా ఇవే విషయాల్ని నూరి పోస్తున్నాడని సమాచారం.

ఇటీవలే వెంకీ పవన్‌కి కొన్ని భక్తి సంబంధిత పుస్తకాల్ని చదవమని ఇచ్చారట. అలాగే తనకి తెలిసిన భక్తి జ్ఞానాన్ని పవన్‌తో షేర్‌ చేసుకుంటున్నాడట. ఇప్పటికే పవన్‌ తన నెత్తిన చాలా బ్యాగేజీనే వేసుకున్నాడు. జనసేన పార్టీ, ప్రజలకు మంచిచేస్తా అంటూ కంకణం కట్టుకున్నాడు. ప్రజల్ని ఉద్ధరించాలి అనుకోవడం అంత పెద్ద బ్యాగేజీ ఈ ప్రపంచంలో ఇంకేమీ ఉండదు. ఓ ప్రజానాయకుడికి ఉన్నన్ని కష్టాలు ఇంకెవరికీ ఉండవు. మానసిక అప్రశాంతత నిత్యం వెంటాడుతూ ఉంటుంది. వెంకీ తీసుకుంటున్న క్లాసుల వల్ల పవన్‌లో ఎలాంటి మార్పు వస్తుందో చూడాల్సిందే. యాథృచ్ఛికంగానే పవన్‌ శ్రీకృష్ణుడి రూపంలో వెంకీ అనే భక్తుడికి ప్రత్యక్షమవ్వడం గోపాల గోపాల పాయింట్‌. ఆ రకంగా ఇద్దరూ ఒకరికొకరు భక్తులైనట్టే కదా!?

0 comments:

Post a Comment