Sunday 21 December 2014

మనసుకు నచ్చిన పని కోసం పడే కష్టం ఎప్పడు ఇష్టంగానే ఉంటుంది


తమిళంలో కథానాయికగా ఎనిమిది చిత్రాల్లో నటిస్తోంది హన్సిక. రోజులో దాదాపు పద్నాలుగు గంటలకుపైగా సినిమా చిత్రీకరణలతోనే సమయాన్ని గడుపుతోంది. వరుస షెడ్యూల్స్ కారణంగా కొన్ని నెలల పాటు ఇంటిముఖం కూడా చూడటానికి ఆమెకు వీలు చిక్కడం లేదట. ఇంతలా కష్టపడటానికి కారణమేమిటని ఈసుందరిని ప్రశ్నిస్తే...ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేయాలంటూ తాత్వికంగా సమాధానమిచ్చింది హన్సిక. ఆమె మాట్లాడుతూ సుఖపడాల్సిన వయసులో సుఖపడాలి. కష్టపడాల్సిన వయసులో కష్టపడాలి.

అంతేకానీ అవకాశాలు వచ్చినప్పుడు తిరస్కరించి ఆ తర్వాత వాటి కోసం ఎదుచుచూడటం నాకు నచ్చదు. అయినా సినిమానే నా జీవితమనుకొని మనస్ఫూర్తిగా ఇష్టపడే ఈ రంగంలో అడుగుపెట్టాను. మనసుకు నచ్చిన పని కోసం పడే కష్టం ఎప్పడు ఇష్టంగానే ఉంటుంది. ఇప్పటికీ నాపై నమ్మకంతో సినీ పరిశ్రమలో ప్రతిరోజు ఐదారు కొత్తకథలు తయారవుతున్నాయి. సినిమాలపై నాకున్న నిబద్ధత, వాటి కోసం నేను పడే శ్రమను చూసే దర్శకనిర్మాతలు నన్ను వెతుక్కుంటూ వస్తున్నారు. వారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలంటే ఆ మాత్రం కష్టపడక తప్పదు అని చెప్పింది.

0 comments:

Post a Comment