Tuesday 30 December 2014

అభినవ కృష్ణుడు చేసిన ఉద్భోద ఏమిటనేది ఆసక్తికరం


వెంకటేష్, పవన్‌కల్యాణ్ కలిసి నటిస్తున్న చిత్రం గోపాల గోపాల. హిందీలో విజయవంతమైన ఓ మైగాడ్ చిత్రానికి రీమేక్ ఇది. సురేష్‌ప్రొడక్షన్స్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డి.సురేష్‌బాబు, శరత్‌మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కిషోర్ పార్థసాని (డాలి) దర్శకుడు. శ్రియ కథానాయిక. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకులముందుకురానుంది. ఓ మైగాడ్ చిత్రంలో అక్షయ్‌కుమార్ పోషించిన మోడ్రన్ కృష్ణుడి పాత్రను తెలుగులో పవన్‌కల్యాణ్ చేస్తున్నారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ దేవుడిపై కేసు వేసి న్యాయస్థానంలో పోరాటం చేసే ఓ మధ్య తరగతి వ్యక్తి కథ ఇది. వినోదంతో పాటు జీవన తాత్వికత మేళవించిన ఈ చిత్రంలో ప్రేక్షకుల్ని ఆలోచింపజేసే సన్నివేశాలుంటాయి.

ఓ సామాన్యుడికి అభినవ కృష్ణుడు చేసిన ఉద్భోద ఏమిటనేది ఆసక్తికరంగా వుంటుంది. సాయిమాధవ్ బుర్రా రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. ఇటీవలే విడుదలైన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది అన్నారు.

మిథున్‌చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, రంగనాథ్, రాళ్లపల్లి, వెన్నెల కిషోర్ పృథ్వి, దీక్షాపంత్, నర్రా శ్రీను, రమేష్‌గోపి, అంజు అస్రాని నటిస్తున్న ఈ చిత్రానికి కథ: భవేష్ మందాలియ, ఉమేష్‌శుక్ల, స్క్రీన్‌ప్లే: కిషోర్‌కుమార్ పార్థసాని, భూపతిరాజా, దీపక్‌రాజ్, కెమెరా: జయనన్ విన్సెంట్, మాటలు: సాయిమాధవ్ బుర్రా (కృష్ణం వందేజగద్గురుం ఫేమ్), సంగీతం: అనూప్‌రూబెన్స్, పాటలు: చంద్రబోస్, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: బ్రహ్మకడలి, కొరియోగ్రఫీ: సుచిత్ర చంద్రబోస్.

0 comments:

Post a Comment