Tuesday 30 December 2014

కమలహాసన్‌ మరుదనాయగం చిత్రం మళ్లీ మొదలు

మరుదనాయగం చిత్ర నిర్మా ణం మళ్లీ మొదలు కానుంది. ఈ విషయాన్ని ఆ చిత్ర కర్త, కర్మ, క్రియ అయిన నటుడు కమలహాసన్‌నే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడిం చారు. 1997 అక్టోబర్ 16వ తారీఖున ఇంగ్లాండ్‌రాణి ఎలిజిబెత్ చేతుల మీదుగా ప్రారంభమైన చిత్రం మరుదనాయగం. వందలాది కళాకారులతో యుద్ధ సన్నివేశాలను తొలిరోజునే భారీ ఎత్తున కమల్ చిత్రీకరించారు. అలా 30 నిమిషాల సన్నివేశాలను చిత్రీకరించిన తరువాత ఆర్థిక సమస్యల కారణంగా మరుదనాయగం చిత్ర నిర్మాణం ఆగిపోయింది. ఆ తరువాత కమలహాసన్ పలుమార్లు ఈ చిత్రానికి పూర్తి చేయాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అలాంటిది సుమారు 17 ఏళ్ల తరువాత మల్లీ మరుదనాయగం చిత్ర నిర్మాణానికి కమల్ నడుం బిగించారు.

దీనిగురించి ఆయన తెలుపుతూ మరుదనాయగం చిత్రాన్ని చేయడానికి నిర్మాత దొరికారన్నారు. లండన్‌కు చెందిన పారిశ్రామికవేత్త అయిన తన స్నేహితుడొకరు ఈ చిత్రాన్ని పూర్తిచేయడానికి సిద్ధం అయ్యారన్నారు. చాలా ఖర్చు అవుతుందని చెప్పినా ఎంత ఖర్చు అయినా తాను నిర్మిస్తానని చెప్పారన్నారు. దీంతో మరుదనాయగం చిత్ర పునః నిర్మాణ కార్యక్రమాలు త్వరలోనే మొదలవుతాయని కమల్ తెలిపారు. ఇది చరిత్ర పౌరుడి ఇతివృత్తంతో కూడిన కథ. భారతదేశం తొలి స్వాతంత్య్ర పోరాట యోధుడు మహ్మద్ యూసప్ ఖాన్ కథేగా మరుదనాయగం     తెరకెక్కనుంది. ఆయన అసలు పేరు మరుదనాయగం పిళై్ల. ఈ చిత్రంలో కమలహాసన్‌తో పాటు సత్యరాజ్, నాజర్, పశుపతి, విష్ణువర్దన్, అమ్రేష్‌పురి ప్రారంభంలో నటించారు.

0 comments:

Post a Comment