Sunday, 23 November 2014

మావయ్యల పై చూపించిన అభిమానమే నాపై చూపిస్తున్నారు


మీ రుణం తీర్చుకోలేను, మావయ్యలు చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌పై మీరు చూపించిన అభిమానమే నాపై చూపిస్తున్న తీరు జీవితాంతం గుర్తుంచుకుంటాను’ అని మెగా హీరో సాయిధరమ్ తేజ్ అన్నారు. ధరమ్‌తేజ్ హీరోగా నటించిన ‘పిల్లా నువ్వులేని జీవితం’ చిత్రం యూనిట్ ఆదివారం సాయంత్రం అమలాపురం వచ్చింది. ఆ చిత్రం ప్రదర్శిస్తున్న రమా థియేటర్‌లో సందడి చేసింది. థియేటర్‌లో ప్రేక్షకులను, అభిమానులనుదే దశించి సాయిధరమ్‌తేజ్ మాట్లాడారు. ఆయనతోపాటు చిత్ర దర్శకుడు రవికుమార్ చౌదరి, నటుడు గబ్బర్‌సింగ్ శ్రీను కూడా మాట్లాడారు. చిత్ర కథానాయిక రెజీనా సందడి చేశారు.

0 comments:

Post a Comment