Monday, 3 November 2014

జర్నలిస్ట్ పై శ్వేతాబసు సీరియస్



ఓ మీడియా సంస్థకు చెందిన జర్నలిస్ట్ పై టాలీవుడ్ నటి శ్వేతాబసు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరవై రోజుల తర్వాత శుక్రవారం రెస్కూ హోమ్ నుంచి విడుదలైన శ్వేతాబసు ముంబై చేరుకుని ఓ మీడియా సంస్థకిచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో పలు విషయాలను వెల్లడించారు. తాను చెప్పని విషయాన్ని ఓ జర్నలిస్ట్ ప్రచురించడంపై సీరియస్ అయ్యారు.
 
నేను కస్టడీలో ఉన్నాను. రెస్క్యూ హోమ్ లో కనీసం నా తల్లి, తండ్రి ఎవరితోనూ కూడా మాట్లాడనివ్వలేదు. అలాంటి పరిస్థితుల్లో మీడియాతో ఎలా మాట్లాడుతాను. శేతాబసు సినీ కెరీర్ ముగిసినట్టే అంటూ నా ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వార్తను ప్రచురించారు. సంపాదన కోసం వేశ్య వృత్తిని ప్రజలు ప్రోత్సహించారు అంటూ కథనంలో అవాస్తవాలను ప్రచురించారు. అవాస్తవాల్ని ప్రచురించిన జర్నలిస్ట్ ను, న్యూస్ పేపర్ గురించి వివరాలు సేకరిస్తున్నాం. అందుకు బాధ్యులైన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం అని శ్వేతాబసు అన్నారు. 

0 comments:

Post a Comment