నాగశౌర్య, అవికాగోర్ జంటగా నటిస్తున్న చిత్రం లక్ష్మీ రావే మా ఇంటికి. గిరిధర్ మామిడిపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద్యాల రవి దర్శకుడు. డిసెంబర్ 5న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాత గిరిధర్ మాట్లాడుతూ ఇటీవల విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. రాధాకృష్ణ సంగీతం, భాస్కరభట్ల, వనమాలి అందించిన సాహిత్యం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సినిమాపై అంచనాలు పెరగడానికి పాటలు బాగా తోడ్పడ్డాయి అన్నారు. భాస్కరభట్ల మాట్లాడుతూ ఆనంద్, గోదావరి, చందమామ చిత్రాల తరువాత రాధాకృష్ణన్‌కు ఈ చిత్రం మళ్లీ అంతటి పేరును తెచ్చిపెట్టింది అన్నారు. సినిమాలో పాటలన్నీ మంచి సాహిత్య విలువలతో వినసొంపుగా వున్నాయన్న పేరొచ్చింది. అవకాశం వస్తే మరోసారి రవి దర్శకత్వంలో నటించాలని వుంది అని నాగశౌర్య తెలిపారు. నాకు తెలిసిన సంగీత దర్శకుడికి ఈ చిత్ర గీతాలు వినిపించాను. పాటలన్నీ చాలా అద్భుతంగా వున్నాయన్నారాయన అని అవికాగోర్ తెలిపింది. దర్శకుడు మాట్లాడుతూ ఆడియో బాగుందని ఇతర దేశాల నుంచి ఫోన్‌లు వస్తున్నాయి. చిత్రంలోని ఆరు పాటలకు రాధాకృష్ణ అద్భుతమైన సంగీతం అందించారు అని అన్నారు.
Friday, 28 November 2014
లక్ష్మీ రావే మా ఇంటికి డిసెంబర్ 5న విడుదలకు సిద్ధమవుతోంది
21:41
Unknown
No comments
నాగశౌర్య, అవికాగోర్ జంటగా నటిస్తున్న చిత్రం లక్ష్మీ రావే మా ఇంటికి. గిరిధర్ మామిడిపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద్యాల రవి దర్శకుడు. డిసెంబర్ 5న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాత గిరిధర్ మాట్లాడుతూ ఇటీవల విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. రాధాకృష్ణ సంగీతం, భాస్కరభట్ల, వనమాలి అందించిన సాహిత్యం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సినిమాపై అంచనాలు పెరగడానికి పాటలు బాగా తోడ్పడ్డాయి అన్నారు. భాస్కరభట్ల మాట్లాడుతూ ఆనంద్, గోదావరి, చందమామ చిత్రాల తరువాత రాధాకృష్ణన్‌కు ఈ చిత్రం మళ్లీ అంతటి పేరును తెచ్చిపెట్టింది అన్నారు. సినిమాలో పాటలన్నీ మంచి సాహిత్య విలువలతో వినసొంపుగా వున్నాయన్న పేరొచ్చింది. అవకాశం వస్తే మరోసారి రవి దర్శకత్వంలో నటించాలని వుంది అని నాగశౌర్య తెలిపారు. నాకు తెలిసిన సంగీత దర్శకుడికి ఈ చిత్ర గీతాలు వినిపించాను. పాటలన్నీ చాలా అద్భుతంగా వున్నాయన్నారాయన అని అవికాగోర్ తెలిపింది. దర్శకుడు మాట్లాడుతూ ఆడియో బాగుందని ఇతర దేశాల నుంచి ఫోన్‌లు వస్తున్నాయి. చిత్రంలోని ఆరు పాటలకు రాధాకృష్ణ అద్భుతమైన సంగీతం అందించారు అని అన్నారు.
0 comments:
Post a Comment