Wednesday 1 October 2014

గోవిందుడు అందరివాడేలే : సినిమా రివ్యూ

 
తెలుగు పోస్టర్ రేటింగ్ 3/5
 
నటీనటులు: రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, జయసుధ, కమిలిని ముఖర్జీ, రావు రమేశ్, కోట శ్రీనివాసరావు
సంగీతం: యువన్ శంకర్ రాజా
కెమెరా: సమీర్ రెడ్డి
నిర్మాత: బండ్ల గణేష్
దర్శకత్వం: కృష్ణవంశీ
కథ 
బాలరాజు(ప్రకాశ్ రాజ్) ఎప్పుడు ఊరు బాగుండాలని కోరుకునే వ్యక్తి ఈయన పెద్ద కుమారుడు చంద్రశేఖర్ (రహమాన్) చిన్న కుమారుడు బంగారం(శ్రీకాంత్) ఇద్దరు కొడుకులుంటారు. తన పెద్ద కుమారుడ్ని వైద్యుడిని చేసి తాను కట్టించే ఆస్పత్రి ద్వారా గ్రామానికి సేవలందించాలని బాలరాజు కోరుకుంటారు. అయితే ఊహించని విధంగా పెద్ద కుమారుడు తండ్రి కోరికని తిరస్కరించి ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి అ అమ్మయితోపాటు లండన్ వెళ్లిపోవడంతో బాలరాజు షాక్ గురువుతాడు. దాంతో బాలరాజు, చంద్రశేఖర్ లు విడిపోతారు. తండ్రికి దూరమై విదేశాల్లో స్థిరపడిన చంద్రశేఖర్ కి అభిరామ్(రామ్ చరణ్), ఓ కూతరు ఉంటుంది. విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన చంద్రశేఖర్ ఓ కారణంతో కుటుంబానికి దూరమయ్యాని చింతిస్తాడు. తన భాదను కొడుకుతో చెప్పడంతో తండ్రి బాధను తెలుసుకున్న అభిరామ్ తన తాత బాలరాజు వద్దకు చేరుకుని ఏం చేశాడు? కుటుంబాన్ని కలుపడానికి చేసిన ప్రయత్నంలో ఎలాంటి సమస్యుల ఎదురయ్యాయి? సమస్యల్ని ఎలా అధిగమించాడు. తండ్రిని, తాతను, కుటుంబాన్ని కలుపడానికి అభిరామ్ చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయా? ఈ క్రమంలో తన మరదలు సత్య(కాజల్) ప్రేమను ఎలా దక్కించుకున్నారనే ప్రశ్నలకు సమాధానమే 'గోవిందుడు అందరివాడేలే'
  
 ప్లస్ పాయింట్స్: 
రామ్ చరణ్, కాజల్ కెమిస్ట్రీ
ప్రకాశ్ రాజ్ ఫెర్ఫార్మెన్స్
ఫోటోగ్రఫి
కృష్ణవంశీ డైరెక్షన్
 
మైనస్ పాయింట్స్:
 
సంగీతం
రొటీన్ కథ,
క్లైమాక్స్
 
 
పలు మాస్, యాక్షన్ చిత్రాల విజయాలతో జోరు మీదున్న రాంచరణ్ ఈ చిత్రంలో కుటుంబాన్ని కలిపే మనవడి పాత్రను పోషించాడు. రామ్ చరణ్ ఇమేజ్ తగినట్టుగా సాంగ్స్, ఫైట్స్ తో అదనంగా భావోద్వేగాలను పలికించే అభిరామ్ పాత్రను పోషించాడు. దసరా పండగ పురస్కరించుకుని వచ్చిన ఈ చిత్రంలో అభిమానుల్ని మెప్పించడానికి అభిరామ్ గా రామ్ చరణ్ చేసిన ప్రయత్నం సఫలమైందనే చెప్పవచ్చు. 
 
 మరదలిగా 'సత్య' పాత్రలో కనిపించిన కాజల్, రామ్ చరణ్ కెమిస్ట్రీ పడింది. రామ్ చరణ్ తో రొమాంటిక్ సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. పాటలకే పరిమితం కాకుండా, శృంగార సన్నివేశాల్లో కొంత అడ్వాన్స్ అయిందనే చెప్పాలి. కొన్ని సన్నివేశాల్లో కూడా కాజల్ తన వంతుగా ఫెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోవడానికి ప్రయత్నించింది. 
 
ఇక ఈ చిత్రంలో బంగారం పాత్రలో శ్రీకాంత్ కొంత నెగిటివ్ షేడ్ ఉన్న కారెక్టర్ ను పోషించాడు. బాధ్యత తెలియని కుమారుడిగా జూదం, మద్యానికి బానిసైన వ్యక్తిగా తన మార్కును ప్రదర్శించాడు. ఇక కమిలిని ముఖర్జి, జయసుధ తమ పాత్రల పరిధిమేరకు పర్వాలేదనిపించారు. 
 
బాలరాజు పాత్రలో ప్రకాశ్ రాజ్ మరోసారి విజృంభించాడు. కుటుంబ పెద్దగా, ఊరి పెద్దగా అందరి బాగు కోసం తపన పడే పాత్రలో జీవించాడు. ఈ చిత్ర భారాన్నంత తన నటనతో ప్రకాశ్ రాజ్ భుజాన వేసుకున్నారని ఎలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. మరోసారి ప్రకాశ్ రాజ్ ఈచిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. 
 
ఈ సినిమాలో అప్పుడప్పుడు వచ్చే విలన్ పాత్రల్లో రావు రమేశ్, కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణమురళిలు తమ పాత్రల పరిధిమేరకు ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే కథలో పెద్దగా విలన్లకు స్కోప్ లేకపోవడంతో వారు చేయాల్సింది ఏమిలేకపోయింది.
 
ముగింపు:
దసరా పండగ రేసులో విడుదలైన 'గోవిందుడు అందరివాడేలే' సూపర్, డూపర్ హిట్ అనే టాక్ బయటికి చెప్పలేకపోయినా.. తొలి ఆటనుంచే పాజిటివ్ టాక్ ని సంపాదించుకుంది. అయితే పాత చిత్రాల కథనే మళ్లీ రిపీట్ చేసారని విమర్శలు ఓ వైపు ఉన్నా.. సెలవు దినాల్లో అభిమానులు, ప్రేక్షకులకు వినోదం పంచుతుంది.

0 comments:

Post a Comment