ఆది, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రఫ్’.
సి.హెచ్.సుబ్బారెడ్డి దర్శకుడు. అభిలాష్ మాధవరం నిర్మాత. ప్రస్తుతం
నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం గురించి నిర్మాత
మాట్లాడుతూ - ‘‘ఆది నటిస్తున్న పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది.
ఇటీవలే విడులైన టీజర్‌కి మంచి స్పందన లభిస్తోంది. మణిశర్మ ఈ చిత్రానికి
అద్భుతమైన స్వరాలందించారు. నవంబర్ 2న పాటల వేడుకను ఘనంగా జరుపనున్నాం’’ అని
తెలిపారు. నటునిగా ఆదిలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే ఈ సినిమా... అతని
కెరీర్‌లో ఓ మైలురాయిలా నిలుస్తుందని దర్శకుడు నమ్మకం వెలిబుచ్చారు. ఈ
చిత్రానికి మాటలు: మరుధూరి రాజా, కెమెరా: సెంథిల్ కుమార్, అరుణ్‌కుమార్,
కూర్పు: మార్తాండ్ కె. వెంకటేశ్.


19:12
Unknown
Posted in:
0 comments:
Post a Comment