Wednesday, 29 October 2014

రెండు నెలల్లో 17 కేజీలు బరువు తగ్గించేశారట అజయ్

ప్రస్తుతం అజయ్‌దేవగన్ ‘యాక్షన్ జాక్సన్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుదేవా దర్శకుడు. కథ రీత్యా ముందు బరువు పెరగమని అజయ్‌కి చెప్పారట ప్రభుదేవా. దర్శకుని మాట ప్రకారం బరువు పెరిగారు అజయ్. మళ్లీ ఉన్నట్టుండి 17 కేజీలు బరువు తగ్గమన్నారట ప్రభు. అంతే, రెండు నెలల్లో 17 కేజీలు బరువు తగ్గించేశారట అజయ్. ఇందులో అజయ్‌దేవగన్ చొక్కా లేకుండా నటించాల్సిన సీన్స్ ఉన్నాయి. ఫిట్‌గా కనిపించాలనే ఉద్దేశంతోనే ఆయన్ను ప్రభుదేవా తగ్గమన్నారట. ఏదేమైనా ముందు బరువు పెరగడం, మళ్లీ రెండే నెలల్లో 17 కేజీలు తగ్గడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది.

0 comments:

Post a Comment