Tuesday, 23 September 2014

జూనియర్‌తో సన్నీలియోన్‌ ఐటెంసాగ్‌?

జూనియర్‌ తదుపరి చిత్రంలో సన్నీలియోన్‌ కనిపించబోతోందని సమాచారం. ఈ చిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్‌ ఈమేరకు సన్నీలీయోన్‌ను సంప్రదించారని సమాచారం. దీనిలో ఐటెంసాగ్‌ కోసం హాట్‌ బ్యూటీ సన్నీ లియోన్‌ని తీసుకుంటే బాగుటుందని అది సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని పూరి జగన్నాథ్‌ భావిస్తున్నారట. ఈ సినిమాలో జూ.ఎన్టీఆర్‌ పవర్‌ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రం ప్రధమార్థంలో వచ్చే ఫైట్‌ సీన్‌ సినిమాకు హైలెట్‌ అయ్యేలా ఉంటుందట. హాలీవుడ్‌ మూవీ స్థాయిలో ఉండే ఈ చేజింగ్‌ అండ్‌ ఫైటింగ్‌ సీన్‌ కోసం ఏకంగా రూ. 3 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా పూరి ముమైత్‌ ఖాన్‌ను ఐటం గర్ల్‌గా తీసుకొచ్చారు. దీనితో వరుసగా ముమైత్‌ సినియాలు చేసి ఓ రేంజికి వెళ్లిన సంగతి తెలిసిందే. మరి పన్నీ ఏరెంజ్‌కు వెలుతుందో వేచి చూడాలి.

0 comments:

Post a Comment