శింబు ఒక నటిని గాఢంగా ముద్దుపెట్టుకుంటున్న సన్నివేశాలు ఇంటర్నెట్‌లో
ప్రచారమై కలకలం సృష్టిస్తున్నాయి. ఒక నక్షత్ర హోటల్లో ఈ చుంబనాల దృశ్యాలను
చిత్రీకరించారు. ఇటీవల పలువురు నటీనటులు మలేషియాలో జరిగిన స్టార్‌నైట్
కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పుడు అక్కడి నక్షత్ర హోటల్లో ఈ ముద్దు
సన్నివేశాల వీడియోను చిత్రీకరించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ
సన్నివేశాల్లో శింబుపై ముద్దుల వర్షం కురిపించింది కన్నడ నటి హర్షిక అనే
కథనాలు వెలువడుతున్నయి. అయితే ఈ ప్రచారాన్ని నటి హర్షిక ఖండించింది. దీని
గురించి ఆమె స్పందిస్తూ వీడియోలో ఉన్న నటిని తాను కాదని స్పష్టం చేసింది. ఈ
వ్యవహారంలో తన పేరును పొరపాటుగా ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. నటుడు
శింబు కూడా ఆ వీడియోలో ఉన్న నటుడిని తాను కాదని వెల్లడించారు.
0 comments:
Post a Comment