ఇవాళ ఐటమ్‌సాంగ్ లేని చిత్రమే లేదంటే అతిశయోక్తి కాదేమో. ఒకప్పుడు ఇలాంటి
పాటల కోసమే ప్రత్యేకంగా శృంగార తారలుండేవారు. అయితే ఇప్పుడా బాధ్యతను కూడా
ప్రముఖ హీరోయిన్లే మోసేస్తున్నారు. నయనతార, శ్రుతిహాసన్, శ్రియ, ప్రియమణి,
చార్మిలాంటి వాళ్లందరూ సింగిల్ సాంగ్‌కు ఆడేసిన వారే. దీంతో ఆయా చిత్రాలకు
పిచ్చ పిచ్చగా ప్రచారం, తద్వారా ఆదాయం వచ్చింది. తాజాగా ఐటమ్‌సాంగ్ గర్ల్
లిస్టులో నటి మీనాక్షి చేరిపోయింది. కరుప్పుస్వామి గుత్తగైదార్ చిత్రం
ద్వారా కరణ్‌కి జంటగా కోలీవుడ్‌కు పరిచయమైన ముంబయి బ్యూటీ మీనాక్షి. ఆ
తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా ఆశించిన స్థాయికి చేరలేకపోయింది.
మూడేళ్లకు పైగా తమిళ తెరకు దూరమైన భామ తాజాగా మరోసారి తమిళ చిత్ర పరిశ్రమలో
తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యింది.
పస్తుతం రెండు చిత్రాల్లో హీరోయిన్‌గాను ఒక చిత్రంలో సింగిల్ సాంగ్‌కు నటిస్తోంది. దీని గురించి మీనాక్షి మాట్లాడుతూ, ధనుష్ హీరోగా నటిస్తున్న చిత్రం సూదాడి చిత్రంలో పార్తీపన్‌కు జంటగా నటించనున్నట్లు తెలిపింది. ఈ చిత్రంలో ధనుష్‌కు జంటగా లక్ష్మీమీనన్ నటించనున్నట్లు చెపింది. ఇటీవల ముంబయి వచ్చిన చిత్ర దర్శకుడు వెట్రిమారన్ సూదాడి చిత్ర కథ చెప్పి పార్తీపన్ సరసన నటించమని అడిగినట్లు తెలిపింది. పాత్ర నచ్చడంతో అంగీకరించానంది. చిత్రంలో తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందని చీర ధరించిన పాత్ర గ్లామరస్‌గా ఉంటుందని పేర్కొంది. ఈ చిత్రం అక్టోబరులో ప్రారంభమై వచ్చే ఏడాది మధ్యలో విడుదలవుతుందని చెప్పింది. ఈ చిత్రంతోపాటు నందాకు జంటగా విళంగం చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పిం ది.

0 comments:
Post a Comment