Friday, 19 September 2014

నాకేం కొత్తకాదు - తమన్నా



‘నేను సినిమా పరిశ్రమలో ఉన్నది అన్ని తరహా పాత్రల్లో నటించడానికే’ అంటోంది తమన్నా. ఈ మిల్కీవైట్‌ బ్యూటీ నటించిన ‘ఆగడు’ శుక్రవారం విడుదలైంది. ఇందులో సరోజా పాత్రలో స్వీట్స్‌ షాప్‌ ఎండీగా నటించింది తమన్నా. లంగా ఓణీల్లో కనువిందు చేసిన తమన్నాకు స్వతహాగా ఎలాంటి పాత్రలంటే ఇష్టమని అడిగితే ‘‘నన్ను దృష్టిలో పెట్టుకుని దర్శకులు రాసుకున్న పాత్రలన్నీ నాకు నచ్చినవే. పాత్ర డిమాండ్‌ను బట్టి నన్ను నేను మౌల్డ్‌ చేసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాను. కావాలంటే గ్లామర్‌గా నటిస్తాను. వద్దనుకుంటే డీ గ్లామర్‌ పాత్రల్లో చేయడానికైనా సిద్ధమే. ఏదైనా దర్శకుడు చెప్పినదాన్నిబట్టే చేస్తాను. ‘ఊసరవెల్లి’లో డీ గ్లామర్‌గా నటించిన విషయం అందరికీ తెలుసు. వరుసగా సినిమాలు చేయాలనే ఆతృత నాలో లేదు. నాకు పెద్దగా వయసైపోలేదు. మనలో ప్రతిభ ఉండి, దానికి ఓపిక కూడా తోడయితే తప్పకుండా మంచే జరుగుతుందనడానికి నా కెరీరే ఉదాహరణ. అవార్డుల కోసం నేనెప్పుడూ సినిమాలు చేయలేదు. ఇకపై కూడా చేయను. నా నటన బావుందని ప్రేక్షకులు ఒక్కమాట చెబితే అదే నాకు గొప్ప అవార్డు’’ అని వివరించింది తమన్నా.

0 comments:

Post a Comment