Monday 8 September 2014

‘కిక్-2′లో రకూల్ ని హీరోయిన్ గా తీసుకున్నట్లు టాలీవుడ్ తాజా సమాచారమ్

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కిక్-2′. సురేందర్ రెడ్డి దర్శకుడు. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఇటీవలే కొబ్బరికాయ కొట్టుకొంది. ‘కిక్’లో రవితేజతో పోటీపడి ‘కిక్’నిచ్చింది ఇలియానా. ఇప్పుడేమో ఈ అమ్మడు బాలీవుడ్ లో తిష్టవేసింది. మరీ.. సీక్వీల్ లో ‘కిక్’నిచ్చే ముద్దుగుమ్మ ఎవరు? ఇంకేవరూ.. రకుల్ ప్రీత్ సింగ్ నేనట. ‘కిక్-2′లో రకూల్ ని హీరోయిన్ గా తీసుకున్నట్లు టాలీవుడ్ తాజా సమాచారమ్. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ తో ఆకట్టుకున్న రకుల్ ఎక్స్ ప్రెషన్స్ నచ్చి మరీ.. కిక్-2 లో ఛాన్స్ ఇచ్చారంట. సో.. రవితేజతో.. కలసి రకుల్ ‘కిక్’నివ్వనుందన్న మాట. మరీ.. ఏ మేరకు ‘కిక్’నిస్తుందో చూడాలంటే.. మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం కిక్-2 సెట్స్ పై వుంది. ఈ చిత్రానికి సంగీతం థమన్. కథ-మాటలు వక్కంతం వంశీ.

0 comments:

Post a Comment