‘‘సోనం బాజ్వా పలుసార్లు నా చెంప పగులగొట్టింది. అయినా ఓర్చుకున్నాను’’
అంటున్నారు యువ నటుడు వైభవ్. ఈయన ప్రముఖ తెలుగు దర్శకుడు కోదండరామిరెడ్డి
కొడుకు. అయితే తెలుగు కంటే తమిళ చిత్ర పరిశ్రమే వైభవ్‌ను ఎక్కువగా
ఆదరిస్తోంది. సరోజ చిత్రంతో కోలీవుడ్‌లో రంగ ప్రవేశం చేసిన ఈయన ఆ తరువాత
మంగాత్త తది తర చిత్రాల్లో నటించారు. ఆ మధ్య విడుదలైన ద్విభాష చిత్రం
అనామిక నయనతారతో కలసి నటించారు. తాజాగా వైభవ్ హీరోగా నటించిన కప్పల్ చిత్రం
ఈ నెల 25న తెరపైకి రానుంది.
శంకర్ శిష్యు డు కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సోనం బాజ్వా హీరోయిన్‌గా నటించారు. ఇందులో తన అనుభవాల గురించి వైభవ్ తెలుపుతూ సాధారణం గా పరిచయాలు స్నేహంగా మారడం, అది ప్రేమకు దారితీయడం సహజమన్నారు. అలాంటి స్నేహం ప్రేమకు శత్రువుగా మారి ఎలాంటి సమస్యలను సృష్టించిందన్నదే కప్పల్ చిత్రం అని తెలిపారు. ప్రేమకు, స్నేహానికి మధ్య చిక్కి సతమతమయ్యే పాత్రలో నేను నటించానని చెప్పారు. నా స్నేహితులైన కరుణ, అర్జునన్, వెంకట్, కార్తీక్ తన ప్రేమకు ఎలా శత్రువులుగా మారారన్న విషయాలను దర్శకుడు ఆద్యంతం ఆసక్తిగా హాస్యభరితంగా తెరకెక్కించారని తెలిపారు. ఒక సన్నివేశంలో హీరోయిన్ సోనం బాజ్వా తన చెంప మీద కొట్టాల్సి వుంటుందన్నారు.
ఆ సన్నివేశాన్ని పలు టేక్‌లు తీసుకవోడంతో సోనం బాజ్వా తన చెంప చెళ్లుమనిపించిందని చెప్పారు. మంగాత్త చిత్రంలోనూ ఇలాంటి సంఘటనే జరిగిందని ఆ చిత్రం విజయం సాధించడంతో ఆ సెంటిమెంట్ ఈ కప్పల్‌కు పనిచేస్తుందని భావిస్తున్నానన్నారు. సినిమా రంగంలోకి ప్రవేశించినపుప్డే శంకర్ దర్శకత్వంలో నటించాలని కోరుకున్నానన్నారు. అలాంటిది ఆయన విడుదల చేస్తున్న ఈ కప్పల్ చిత్రంలో తాను హీరో అవడం ఆనందంగా ఉందన్నారు. దర్శకుడు విడుదల చేస్తున్నారనగానే కప్పల్ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయని అలాంటి అంచనాలను ఈ చిత్రం పూర్తి చేస్తుందని వైభవ్ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

0 comments:
Post a Comment