‘గ్లామర్ పాత్రలకే పరిమితమైపోతే నాకు నేనే బోర్ కొట్టేస్తాను. దాంతో పాటే
ప్రేక్షకులకూ బోర్ కొట్టేస్తాను. అందుకే విభిన్నంగా ఉండే పాత్రకు అవకాశం
వస్తే.. ఎంతైనా కష్టపడటానికి నేను రెడీ’’ అని తాప్సీ చెప్పారు.
అన్నట్లుగానే ‘ముని 3’ కోసం బాగా కష్టపడుతున్నారామె. ఈ చిత్రం కోసం తీసిన ఓ
సన్నివేశం కోసం తొమ్మిది గంటల పాటు ఆమె నీళ్లల్లో ఉండాల్సి వచ్చింది.
రెండు రోజుల్లో తీద్దామని దర్శకుడు లారెన్స్ అన్నప్పటికీ ఒకే రోజులో
తీస్తేనే ఎమోషన్ సరిగ్గా పండుతుందని తొమ్మిది గంటలు నీళ్లల్లో ఉన్నారట.
ఫలితంగా నీటిలోంచి బయటికొచ్చేసరికి తాప్సీ ఒళ్లంతా నానిపోయిందట. అయినా తేలిగ్గా తీసుకున్నానని తాప్సీ అంటున్నారు. ఇంకా ఈ చిత్రం కోసం చేసిన మరో క్లిష్టమైన సన్నివేశం గురించి తాప్సీ చెబుతూ -‘‘చెన్నయ్ బీచ్‌లో ఈ యాక్షన్ సీన్ చేశాం. బీచ్‌లోని ఇసుకలో నన్ను ఈడ్చుకెళ్లేట్లు సీన్ అన్నమాట. ఇసుక, చిన్న చిన్న రాళ్లతో నా వళ్లు హూనం అయిపోయింది. ఈ ఫైట్‌ని మూడు రోజులు చేశాం. నరకం కనిపించింది. కానీ, ఆ నరకమే హాయిగా అనిపించింది. ఎందుకంటే, నటిగా పూర్తి సంతృప్తి లభించింది’’ అని చెప్పారు.

0 comments:
Post a Comment