అత్తారింటికి దారేది చిత్ర విజయంతో తెలుగు చిత్రపరిశ్రమ వర్గాల దృష్టిని ఆకర్షించింది కన్నడ భామ ప్రణీత. ఈ చిత్రం తరువాత ఎన్టీఆర్‌తో కలిసి రభస చేసిన ఈ సుందరి తాజాగా సూర్యకు జోడీగా నటించే అవకాశాన్ని దక్కించుకుందని తెలిసింది. సూర్య హీరోగా తమిళంలో వెంకట్‌ప్రభు మాస్ అనే పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కె.ఇ.జ్ఞానవేల్‌రాజాతో కలిసి ఈ చిత్రాన్ని 2డి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై హీరో సూర్య నటిస్తూ నిర్మిస్తున్నారు.
సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార ప్రధాన నాయికగా నటిస్తుండగా, కీలకమైన ఘోస్ట్ పాత్రలో అమీ జాక్సన్ నటిస్తోంది. సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రం కోసం రెండో నాయికగా ప్రణీతను ఎంపిక చేసుకున్నట్టు తమిళ చిత్ర వర్గాల సమాచారం. ఇప్పటి వరకు దాదాపు యాభైశాతం చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది.

0 comments:
Post a Comment