‘‘తెరపై రొమాంటిక్ సన్నివేశాలు చూస్తున్నప్పుడు ప్రేక్షకులు.. ముఖ్యంగా కుర్రకారు తెగ ఎంజాయ్ చేస్తారు. అలాంటి సన్నివేశాల కోసమే సినిమాలు చూడ్డానికి వెళ్లేవాళ్లు ఉంటారంటే అతిశయోక్తి కాదు. కానీ, ఆ సన్నివేశాల్లో నటించడం అంత సులువు కాదు’’ అని తమన్నా అంటున్నారు. దీని గురించి విపులంగా చెబుతూ -‘‘హీరో, హీరోయిన్ రొమాంటిక్ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు, ఆ ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదరాలి. అందుకే మేం అంతగా లీనమైపోతాం. అది చూసి, మేం నిజంగానే ఇన్వాల్వ్ అయిపోయి నటించామని కొంతమంది ఊహిస్తారు.
అలా ఊహించడం తప్పు. మేం కెమేరాల ముందు రొమాన్స్ చేయడానికి ఎంత ఇబ్బందిపడతామో మాకు తెలుసు. చుట్టూ వందల మంది ఉంటారు. లైట్స్ ఉంటాయి. వాటి నుంచి వచ్చే వేడి మామూలుగా ఉండదు. ఇక, డెరైక్టర్ స్టార్ట్ అనగానే.. సీన్‌లోకి ఎంటరవుతాం. ‘ఇంకా దగ్గరకు రండి.. ఇంకా గట్టిగా హత్తుకోండి’ అని డెరైక్టర్ మైక్‌లో చెబుతుంటే.. ఆ సీన్ పండితే చాలనుకుంటాం కానీ.. వేరే ఆలోచనలు ఎందుకుంటాయి? అక్కడ ఇన్‌వాల్వ్ అయినట్లు నటిస్తాం కానీ.. నిజంగా లీనమైపోం. ఇప్పుడు చచ్చిపోయే సీన్ ఉందనుకోండి.. నిజంగానే చచ్చిపోతామా ఏంటి? నటిస్తాం కదా.. రొమాంటిక్ సీన్స్ కూడా అంతే’’ అని చెప్పారు.
0 comments:
Post a Comment