Wednesday 3 September 2014

‘అన్నా క్యాంటీన్’ ఏర్పాటుకు సిద్ధవుతున్న విశాఖ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘అన్నా క్యాంటీన్’ పధకం అమలుకు గ్రేటర్ విశాఖ సర్వం సిద్ధం అవుతోంది. కాగా తమిళనాడు ‘అమ్మా క్యాంటీన్’ తరహాలో రూపొందుతున్న ఈ క్యాంటీన్ లలో అత్యల్ప ధరకే నాణ్యమైన ఆహారాన్ని అందించనున్నారు,అయితే మొదటి విడతగా నియోజక వర్గానికి రెండు క్యాంటీన్లను ఏర్పాటు చెయ్యనున్నారు. అలాగే వీటి నిర్వహణ మరియు ఇతర విషయాలను పరిశీలించడానికి సీనియర్ అధికారుల బృందం చెన్నైకి చేరుకొని అక్కడ క్యాంటీన్లను గమనించింది. దీనిపై కమీషనర్ ఎంవీ సత్యనారాయణ మాట్లాడుతూ అసెంబ్లీ సిగ్మేంట్ కి రెండు క్యాంటీన్ల చొప్పున ఈ పధకాన్ని మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్లుగా తెలిపారు. కాగా విశాఖలో ఇంకా ఏ ప్రదేశాలలో క్యాంటీన్లను ఏర్పాటు చెయ్యాలో నిర్ణయించలేదని, స్థానిక ఎమ్మెల్యేలతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రతి క్యాంటీన్ కు నెలకు 1.50లక్షల సబ్సిడీ వనరులను అందిస్తామని సత్యనారాయణ తెలిపారు. ఇక మహిళా సంఘాలు ఈ క్యాంటీన్లను నిర్వహిస్తాయని, రోజువారీ ఆదాయం చొప్పున ఒక్కొక్కరికీ 300రూపాయలు అందుతాయని తెలిపారు. అలాగే ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక పధకంలో నాణ్యమైన ఆహారం లభ్యం కానున్నదని కమీషనర్ వివరించారు.

0 comments:

Post a Comment