Monday, 1 September 2014

బాపు ఇక లేరు





కర్టునిస్టుగా,చిత్రకారుడిగా,దర్శకుడిగా ఖ్యాతిగడించిన బాపు ఆదివారం సాయంత్రం చెన్నైలోని ప్రైవేటు హాస్పిటల్లో కన్నుమూసారు.

బాపు అంటే తెలుగు,తెలుగు అంటే బాపు అన్నట్టుగా తెలుగునాట పేరుసంపాదించారు.
బాపు గా మనకు తెలిసినా అయన అసలు పేరు సత్తిరాజు లక్ష్మినారయణ. బాపు చిన్నప్పటి  చిత్రకళ ఆసక్తి సాక్షి సినిమాతో మొదలైంది 1967 లో కృష్ణ విజయనిర్మల జంటగా నటించిన ఈ సినిమా బాపుకు మంచి గుర్తింపును తేచిపెట్టింది అలాగే బాపు రమణ జోడి మొదలైంది ఈ సినిమాతోనే. ఇక శోభనబాబుతో తీసిన సంపూర్ణ రామాయణం సినిమాతో జాతీయ స్థాయిలో పేరు సంపాదించారు.
రావు గోపాలరావుతో  అద్భుతంగా సహజంగా డయలాగ్ లు పలికించిన ముత్యాలముగ్గు సినిమాతో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డును సాదించి తెలుగువారు గర్వించ దగ్గ స్థాయికి ఎదిగాడు. తెలుగు చిత్రసిమలో స్నేహమంటే బాపు రమణల తరువాతే ఎవరైనా అని నిస్సందేహంగా చెప్పవచ్చు. బాపు సినిమాలన్నింటికీ రమణ సంభాషణలు అందించారు. ఏదేమైనా బాపు మృతి తెలుగు చిత్రసిమకి తీరని లోటు

0 comments:

Post a Comment