Saturday, 30 August 2014

చిరు తో నాగ్ మల్టీ స్టారర్ చిత్రం..?





ఇప్పుడు తెలుగు లో మల్టీ స్టారర్ ట్రెండ్ బాగా నడుస్తుంది.. మహేష్ బాబు- వెంకటేష్ ,రామ్ చరణ్- బన్నీ ,ఎన్టీఆర్- నాగార్జున ,పవన్ కళ్యాణ్ -వెంకటేష్, తాజాగా ఇప్పుడు చిరంజీవి – నాగార్జున ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నట్టు టాలీవుడ్ సినీ వర్గాలలో హాట్ హాట్ గా చర్చించుకుంటున్నారు దీనికి ఓ కారణం కూడా ఉంది లెండి.
ఇటీవలే ఈ ఇద్దరు హీరోలు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే ప్రోగ్రాం లో బుల్లితెరపై కనిపించి ప్రేక్షకులను మెప్పించారు.
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జునని చిరుతో మల్టీ స్టారర్ సినిమా ఎప్పుడు చేస్తారని అడిగితే ‘ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో కలిసి ఓ సినిమా చేయాలనుకుంటున్నాం. కానీ మంచి కథ దొరక లేదు. కానీ చిరు 150వ సినిమా సోలోగానే చేస్తే బాగుంటుంది. ఆ తర్వాత మంచి కథ దొరికితే మేమిద్దరం కలిసి ఓ సినిమా చేస్తాం’ అని అన్నాడు.
ప్రస్తుతం చిరంజీవి తన 150వ సినిమా చేసే పనిలో ఉంటే నాగార్జున కూడా తన తదుపరి సినిమా కోసం సిద్దమవుతున్నాడు

0 comments:

Post a Comment